చిట్యాల, నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా, వారికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల కథనం ప్రకారం, వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రహదారి పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం భారీగా దెబ్బతింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు.
PRINT TIME: October 09, 2026 02:29 PM
పిట్టంపల్లి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

17-06-2026
302 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల, నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా, వారికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికుల కథనం ప్రకారం, వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రహదారి పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం భారీగా దెబ్బతింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి