Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:02 PM

చౌటుప్పల్‌ను ‘మోడల్ సిటీ’గా మారుస్తాం ​వార్డు సభల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్‌ను ‘మోడల్ సిటీ’గా మారుస్తాం ​వార్డు సభల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్‌ను ‘మోడల్ సిటీ’గా మారుస్తాం ​వార్డు సభల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్
June 08, 2026 07:16 PM 288 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేల వరకు జరిమానా: కమిషనర్

​ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరదృష్టితో చౌటుప్పల్ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన 'మోడల్ సిటీ'గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక" లో భాగంగా వివిధ వార్డుల్లో వార్డు సభలు విజయవంతంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలకు వివిధ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.రోడ్లపై, డ్రైనేజీల్లో చెత్త వేస్తే రూ. 500 నుండి రూ. 5,000 వరకు జరిమానా విధిస్తామని కమిషనర్ వెంకటేశ్వర నాయక్ హెచ్చరించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని చైర్‌పర్సన్ ప్రకటించారు.విద్యుత్ స్తంభాల తొలగింపు, మహిళా భవన నిర్మాణం, స్మశాన వాటిక ప్రహరీ గోడ, ప్రభుత్వ ఆసుపత్రి పనుల వేగవంతంపై ఆయా వార్డుల్లో చర్చించారు. మున్సిపాలిటీలో జనగణన (సెన్సస్)కు వచ్చే ఉపాధ్యాయులకు ప్రజలు సహకరించాలని, వర్షాకాలం దృష్ట్యా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు కోరారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డులు పరిశీలించాలని పోలీస్ శాఖ సూచించింది.​ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు, ఈ అన్ని వార్డు సభల్లో షాదీఖానా చైర్మన్ కరీం, ఎజాస్ పాషా, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, కానుగుల వెంకటయ్య, బండారు నరసింహ, ఎండీ పాషా, ఖలీల్, ఆవుల యేసు, మున్సిపల్ ఆర్వో అంజయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, వార్డు ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News