Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సీఐ సత్యనారాయణ రెడ్డి

10-06-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనగామ,

రోడ్డుపై అనాధగా తిరుగుతూ ఆందోళనతో కనిపించిన ఓ వృద్ధుడికి జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి అండగా నిలిచారు. అతడిని ఓదార్చి, భోజనం ఏర్పాటు చేసి, అనంతరం వృద్ధాశ్రమంలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు.

జనగామ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో రెండు రోజులుగా ఓ 65 ఏళ్ల వృద్ధుడు అనాధగా తిరుగుతున్నాడని స్థానిక జర్నలిస్టు సోమవారం సీఐ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఐ అతడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన దుర్గాస్వామి అలియాస్‌ దుర్గానాయుడుగా గుర్తించారు.

అన్నదమ్ములు లేకపోవడంతో ఆరేడు సంవత్సరాల క్రితం స్వగ్రామం విడిచి వచ్చానని, కొంతకాలం ఆలయాల్లో సేవలు చేశానని, అనంతరం మానసిక సమస్యల కారణంగా అక్కడ ఉండలేక దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని వృద్ధుడు తెలిపాడు.

వృద్ధుడి పరిస్థితిని గమనించిన సీఐ ముందుగా అతనికి ఆహారం అందించారు. అనంతరం హెడ్‌ కానిస్టేబుల్‌ కిషన్‌ ద్వారా ప్రత్యేకంగా భోజనం తెప్పించి తినిపించారు. తర్వాత పోలీస్‌ వాహనంలో జనగామలోని రాజేశ్వరి వృద్ధాశ్రమానికి తరలించి చేర్పించారు.

పోలీసుల ఆప్యాయతతో వృద్ధుడిలో ధైర్యం పెరిగిందని స్థానికులు తెలిపారు. రోడ్లపై అనాధలుగా, నిరాశ్రయులుగా ఎవరైనా కనిపిస్తే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని, వారికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు

Sthanikam

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా సీఐ సత్యనారాయణ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News