Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరపత్రాల విడుదల

10-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

హిందూపురం పట్టణంలోని ఎన్‌జీఓఎస్ కార్యాలయంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జూలై 1 నుండి 4 వరకు కర్నూలు నగరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు, జిల్లా నిర్మాణ బాధ్యులు కామ్రేడ్ వేమయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండడం వల్ల పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు.పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 కారణంగా అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య హక్కును పరిరక్షించే దిశగా ప్రభుత్వం జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే రాష్ట్రంలో మెడికల్ విద్యను ప్రైవేటీకరించే చర్యలను ప్రభుత్వం విరమించుకోవాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అన్ని విధాలుగా బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాల లోపం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యా వ్యవస్థను పరిరక్షించడం, నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాడుతుందని, రాష్ట్ర స్థాయి విద్యా-వైజ్ఞానిక-రాజకీయ శిక్షణ తరగతుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, చంద్ర, గౌరీ శంకర్, సునీల్, మనోజ్, కలందర్, మారుతి, సునీల్, నాగేంద్ర, నయీమ్, వికాస్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కరపత్రాల విడుదల

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News