Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

గూడూరులో నిరుద్యోగ యువతకు ఘనంగా జాబ్ మేళా

09-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

గూడూరులో నిరుద్యోగ యువతకు ఘనంగా జాబ్ మేళా

బీబీనగర్ మండల పరిధిలోని గూడూరు,గ్రామంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గూడూరు గ్రామ సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్ సహకారంతో సోమవారం గ్రామపంచాయతీ ఆవరణంలో జాబ్ మేళా నిర్వహించారు. పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ విద్యార్హతలు కలిగిన యువతీ యువకుల కోసం ఎంఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జానా సత్యనారాయణ,పాలకవర్గ సభ్యులు బింగి సంజయ్,అంకర్ల శ్రీనివాస్,దొనకొండ శ్రీరాములు,తరుపునూరి అశ్విని బాలరాజ్ గౌడ్,బింగి లావణ్య రమేష్‌తో పాటు గ్రామ ప్రజలు,యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బింగి అలివేలు మంగ శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామంలో చదువుకున్న యువతీ యువకులు ఎవరూ నిరుద్యోగులుగా ఉండకుండా ప్రతి ఒక్కరూ ఉపాధి పొందుతూ తమ కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఉద్యోగం ద్వారా ఆర్థికంగా స్థిరపడుతూ తమ భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు యువత సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించడంతో పాటు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందగలరని పేర్కొన్నారు. తాను మహిళా సర్పంచ్‌గా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను చేరువ చేస్తూ నిర్వహించిన ఈ జాబ్ మేళా గ్రామ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది.

Sthanikam

గూడూరులో నిరుద్యోగ యువతకు ఘనంగా జాబ్ మేళా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News