Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:54 PM

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 3.27 కోట్లు!

30-05-2026 347 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కౌన్సిల్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

స్మశాన వాటికల అభివృద్ధి, సిసి రోడ్లు, డ్రైనేజీలకు నిధులు

అధికారులతో చైర్‌పర్సన్‌ మొగుదాల పావని రమేష్‌ గౌడ్‌ సమీక్ష

​చౌటుప్పల్ పురపాలక సంఘ సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పట్టణ ప్రగతి, ప్రజల అత్యవసర అవసరాలే ధ్యేయంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

​ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని ప్రధానంగా రెండు స్మశాన వాటికల అభివృద్ధి పనులకు కౌన్సిల్ తీర్మానం ఆమోదించింది. అలాగే పట్టణంలోని వివిధ వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యల పరిష్కారానికి రూ. 3 కోట్ల 27 లక్షల భారీ నిధులను మంజూరు చేస్తూ కౌన్సిల్ సుదీర్ఘ చర్చల అనంతరం ఆమోదం తెలిపింది.ఈ నిధులతో పట్టణంలోని వివిధ వార్డులలో క్రింది అభివృద్ధి పనులను చేపట్టనున్నారు:

​అత్యవసర మురుగు కాలువల (డ్రైనేజీ) నిర్మాణాలు.

​అంతర్గత రవాణాను మెరుగుపరచడానికి సిసి రోడ్ల నిర్మాణాలు. పట్టణాన్ని వెలుగులతో నింపేందుకు కొత్త వీధి లైట్ల ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల కల్పన.

​అధికారులతో ముఖాముఖి – వార్డు సమస్యలపై చైర్‌పర్సన్ సమీక్ష:

సమావేశంలో భాగంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ వివిధ ప్రభుత్వ విభాగాల (లైన్ డిపార్ట్‌మెంట్) అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల కౌన్సిలర్లు తమ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించారు.

​వీధి దీపాలు, పాత విద్యుత్ స్తంభాల మార్పిడిపై విద్యుత్ శాఖ ఎ ఈ సతీష్‌తో చర్చించారు.తాగునీటి లీకేజీల నివారణ, అమృత్ 2.0 వాటర్ ట్యాంక్ల నిర్మాణ నిర్వహణపై మిషన్ భగీరథ ఏ ఈ శ్వేత, ఏ ఈ వినయ్ కుమార్‌లతో సమీక్షించారు. ప్రధాన రహదారులు, వలిగొండ రోడ్డు మరమ్మతులపై ఆర్ అండ్ బి ఏ ఈ నవీన్‌తో చర్చించారు.

​వైద్యరంగం మున్సిపల్ పరిధిలో కొత్తగా నాలుగు బస్తీ దవాఖానాలు మంజూరైనట్లు ఆరోగ్య శాఖ ప్రతినిధి డా. కాటమరాజు కౌన్సిల్‌కు తెలిపారు. పట్టణంలో ప్రజారోగ్యం, పాఠశాలల వసతులపై విద్యాశాఖ ఎంఈఓ గురువారావు, అంగన్వాడి సూపర్‌వైజర్ శోభారాణి, ఎఫ్‌ఆర్‌ఓ లతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు.​ఈ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ నితీష్ రెడ్డి, ఆర్‌ఓ అంజయ్య, సీనియర్ అసిస్టెంట్లు రఘుపతి, దీప, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 3.27 కోట్లు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News