- వ్యవసాయాన్ని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
సూర్యాపేట మండలం కాసారాబాద్ గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ పాల్గొని వరి కొయ్యలను తగలబెట్టవద్దని రైతులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. వరి పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే కొయ్యలను కాల్చడం వల్ల భూమి సహజ సారవంతత దెబ్బతింటుందని, నేలలోని సూక్ష్మజీవులు నశించి పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుందని వివరించినట్లు తెలిపారు.
వరి కొయ్యల దహనం కారణంగా రైతులు ఎరువులపై అధిక వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు తెలిపారు. అలాగే సమీపంలోని చెట్లు, వ్యవసాయ పరికరాలు, విద్యుత్ లైన్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించినట్లు తెలిపారు.
పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలపడం ద్వారా భూసారం పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని రైతులకు సూచించినట్లు తెలిపారు. ఎవరైనా వరి కొయ్యలను తగలబెట్టి ప్రమాదాలకు కారణమైతే సంబంధిత వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించినట్లు తెలిపారు.
రైతులు బాధ్యతాయుతంగా వ్యవహరించి వ్యవసాయాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించాలని అధికారులు పిలుపునిచ్చినట్లు తెలిపారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి