Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:06 AM

ఆగస్టు 10న జైలు భరోను విజయవంతం చేయాలి. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పిలుపు.

19-07-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపట

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన మండల సదస్సులో వారు మాట్లాడుతూ, కార్మిక హక్కులను బలహీనపరచడం, రైతు సమస్యలను నిర్లక్ష్యం చేయడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టే జైలు భరోలో కార్మికులు, రైతులు, కూలీలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, సహాయ కార్యదర్శి నకిరకంటి రాము, జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుంద్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, గీత కార్మిక సంఘం, ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఆగస్టు 10న జైలు భరోను విజయవంతం చేయాలి. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పిలుపు.

Article Image

రామన్నపట

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన మండల సదస్సులో వారు మాట్లాడుతూ, కార్మిక హక్కులను బలహీనపరచడం, రైతు సమస్యలను నిర్లక్ష్యం చేయడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టే జైలు భరోలో కార్మికులు, రైతులు, కూలీలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, సహాయ కార్యదర్శి నకిరకంటి రాము, జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మేడి ముకుంద్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, గీత కార్మిక సంఘం, ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News