Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్‌ఆర్‌ ప్రక్రియకు ప్రజలు సహకరించాలి.. వై. పండరి విజ్ఞప్తి అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 07, 2026 08:02 PM

విద్యా రంగానికి సలీం షరీఫ్ సేవలు అమూల్యమైనవి.....

07-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ ఎంఈవో, స్థానిక బాలుర ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ సలీం షరీఫ్ రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం అందుకోవడం పట్ల కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుండెపంగు రమేష్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం బాలుర ఉన్నత పాఠశాలలో సలీం షరీఫ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గుండెపంగు రమేష్ మాట్లాడుతూ మూడు దశాబ్దాల అంకితభావానికి, విద్యా సేవలకు దక్కిన అరుదైన గౌరవం ఈ అవార్డు అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సలీం షరీఫ్ ఈ పురస్కారాన్ని స్వీకరించడం కోదాడకే గర్వకారణమన్నారు. ఉపాధ్యాయుడిగా, హెచ్‌ఎంగా, ఎంఈవోగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచడంలో, పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంలో ఆయన కృషి అభినందనీయమన్నారు. బాసర ఐఐఐటీ, స్కాలర్‌షిప్‌లలో విద్యార్థులు సీట్లు సాధించేలా ప్రోత్సహించారని, దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాల మౌలిక వసతులు అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో పాస్టర్ యెషయా, గంధం పాండు, బరపటి కోటేశ్వరరావు, కుడుముల రాంబాబు, అమరబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.....

Sthanikam

విద్యా రంగానికి సలీం షరీఫ్ సేవలు అమూల్యమైనవి.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News