భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. భారీగా తరలివచ్చిన భక్తులు.
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి భక్తిని చాటుకున్నారు.
ఈ వేడుకల్లో గ్రామ ఉపసర్పంచ్ అంతటి స్వప్న–సత్తయ్య గౌడ్ దంపతులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి నరసింహ గౌడ్ అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. బోనాల పండుగను పురస్కరించుకుని గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు లోడే చిరంజీవి గౌడ్, నోముల రాము, దేశబోయిన మంజుల–మల్లేష్, మహంకాళి లింగస్వామి, జనగాం మంగమ్మ–సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గోలి నరేష్, బద్దం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి