Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 11:56 PM

రేవంత్‌రెడ్డి మాటలు పిట్టల దొర ముచ్చట్లను తలపిస్తున్నాయి...

05-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

రేవంత్‌రెడ్డి మాటలు పిట్టల దొర ముచ్చట్లను తలపిస్తున్నాయి...

బిఆర్ఎస్ అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజు యాదవ్ విమర్శ...

నల్గొండ: "ఉపాధ్యాయ దినోత్సవం నాడు నకిరేకల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు పిట్టల దొర ముచ్చట్లను తలపిస్తున్నాయి" అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ గొర్రెలు-మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ (DBR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడే స్థాయి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని మండిపడ్డారు.

ఆడబిడ్డల సంక్షేమంపై ప్రశ్నాస్త్రాలు...

ఆడబిడ్డల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదని బాలరాజు యాదవ్ అన్నారు. సొంతంగా రాఖీ కట్టించుకున్న బిసి వర్గానికి చెందిన మహిళా మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేసిన రేవంత్, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. "హైందీలో 100, తెలుగులో 90 సీట్లు గెలుస్తామని పొంకనాలు కొడుతున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ 30 సీట్లు కాదు కదా, కనీసం 3 సీట్లు కూడా గెలవదు" అని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్‌లోకి వెళ్లి గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, లేకపోతే సీఎంగా రేవంత్ రాజీనామా చేసి తమ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని, సిరిసిల్ల, సిద్దిపేట స్థానాలను గెలుచుకుంటామని సీఎం పొంకానాలు కొడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటారో లేదో ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వంలో పేదలకు అందించిన కెసిఆర్ కిట్, రైతుబంధు, రైతుభీమా వంటి సంక్షేమ పథకాలు ప్రస్తుతం ఎందుకు అమలవుట్లేదని ప్రశ్నించారు. పాలన చేతకాక రాష్ట్ర భవిష్యత్తును రేవంత్ రెడ్డి ప్రశ్నార్థకంగా మార్చారని, ఆయనొక మహానిరంకుశుడిగా ప్రవర్తిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sthanikam

రేవంత్‌రెడ్డి మాటలు పిట్టల దొర ముచ్చట్లను తలపిస్తున్నాయి...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News