Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధ్యాయుడే సమాజానికి దిక్సూచి భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 06:48 PM

గురువుల సేవలు వెలకట్టలేనివి. ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

05-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, సెప్టెంబర్‌ 5

తల్లిదండ్రుల తర్వాత పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవం, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. సమాజంలో ఉపాధ్యాయులకు అత్యంత పవిత్రమైన స్థానం ఉందని కొనియాడారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దేది గురువులేనన్నారు. ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులు వెలుగులు నింపుతున్నారని చెప్పారు. గురువుల శ్రమ మట్టిలో దాగిన మాణిక్యాలను వెలికితీసేంత గొప్పదని పేర్కొన్నారు.

తాను రైతు కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదగడానికి గురువులే కారణమని గుర్తుచేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 80 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేసి మెమెంటోలు, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా విద్యాధికారి బిక్షపతి, గ్రంథాలయ చైర్మన్‌ అవేజ్‌ చిస్తి, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గురువుల సేవలు వెలకట్టలేనివి. ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News