Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమమే లక్ష్యం ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 03:24 PM

ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు

02-09-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కొనియాడారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదలు, రైతులు, విద్యార్థుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు వంటి అభివృద్ధి పనులతో పాటు రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశారని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్‌ సేవలు ఎప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, డాక్టర్‌ మల్లు రవి, సురేష్‌ షెట్కార్‌, పోరిక బలరాం నాయక్‌ తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు.

.

Sthanikam

ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News