Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:38 AM

అపోహలు వీడి.. అవయవదానానికి ముందుకు రావాలి. డాక్టర్ భూషణ్ రాజు.

13-08-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అవయవదానం.. ఓ జీవితానికి పునర్జన్మ!

అపోహలు వీడి.. అవయవదానానికి ముందుకు రాజు.

హైదరాబాద్, ఆగస్టు 13 స్థానికం ప్రతినిధి:

అవయవదానం ద్వారా మరో వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించవచ్చని నిమ్స్ నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్, అధిపతి, ఎస్‌వోటీటీవో (జీవన్‌దాన్) విభాగాధిపతి డాక్టర్ శ్రీ భూషణ్ రాజు అన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘అవయవ దానం: అపోహలు–వాస్తవాలు’ అంశంపై ‘వార్త’ మీడియా కార్యశాల నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ భూషణ్ రాజు మాట్లాడుతూ.. వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా మానవ అవయవాలను పూర్తిగా కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాలేదన్నారు. అందువల్ల అవయవదాతలు, వారి కుటుంబాల ఉదారత ఎంతో విలువైనదని చెప్పారు. అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు దానం చేసిన అవయవం కొత్త జీవితాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.దేశంలో అవయవ మార్పిడికి భారీ డిమాండ్ ఉండగా.. అందుబాటులో ఉన్న అవయవాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ అంతరాన్ని తగ్గించాలంటే ప్రజల్లో అవయవదానంపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలు, తప్పుడు ప్రచారాలను తొలగించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు.

దాత, గ్రహీతలకు వైద్యపరంగా సరిపోలని సందర్భాల్లో స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా అవయవ మార్పిడి చేసే అవకాశం ఉందని వివరించారు. కుటుంబాలు అవయవదానంపై ముందుగానే చర్చించుకోవాలని, స్వచ్ఛందంగా దానానికి అంగీకారం తెలియజేయాలని కోరారు.

పీఐబీ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. దేశంలో అవయవ మార్పిడికి ఉన్న డిమాండ్, అందుబాటులో ఉన్న అవయవాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందన్నారు. ఎన్‌వోటీటీవో, ఎస్‌వోటీటీవోలు అవయవదానం, మార్పిడి ప్రక్రియలో కీలకంగా పనిచేస్తున్నాయని తెలిపారు. మీడియా కార్యశాలల ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వాస్తవాలను చేరవేస్తున్నామని చెప్పారు.

కార్యశాలలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని అవయవదానానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం పిలుపునిచ్చింది.

అవయవదానంపై సమాచారం, సహాయం కోసం 1800-11-477 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.

Sthanikam

అపోహలు వీడి.. అవయవదానానికి ముందుకు రావాలి. డాక్టర్ భూషణ్ రాజు.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News