Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:51 PM

సామాజిక న్యాయమే లక్ష్యం.. బీసీలకు 50% రిజర్వేషన్ల వరకు పోరాటం. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత.

06-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సామాజిక తెలంగాణ సాధిస్తాం.

అణగారిన వర్గాలతో కొత్త చరిత్ర లిఖిస్తాం.

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పేదలకు అన్యాయం చేశాయి.

"నా పుట్టుక నా చేతిలో లేదు.. ఎవరి కోసం పనిచేయాలో నా చేతిలోనే ఉంది

సామాజిక న్యాయమే లక్ష్యం.. రాజ్యాంగం సంపూర్ణ అమలే మా సంకల్పం"గా సామాజిక తెలంగాణ సాధిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ నిర్వహించారు. సభలో కల్వకుంట్ల కవిత కీలక ప్రసంగం చేశారు. తన ఆత్మ, మనసు ఒప్పుకోని పని ఎంత పెద్ద లాభం వచ్చినా ఎప్పటికీ చేయనని, విలువలను వదులుకుని ఉంటే నేడు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదం, సహకారంతో తెలంగాణలో ఖచ్చితంగా మంచి మార్పు తెస్తామనే విశ్వాసంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించానన్నారు. సామాజిక న్యాయం అంటే అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమే అసలైన సామాజిక న్యాయమని చెప్పారు. ఈ సభ కోట్లాది మంది జీవితాల్లో మార్పుకు నాంది పలుకుతుందని, రాజరిక కాలంలో అణగారిన వర్గాలపై జరిగిన అన్యాయాలకు ప్రజాస్వామ్యం ముగింపు పలికిందని పేర్కొన్నారు. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ అది ఇప్పటికీ సంపూర్ణంగా అమలు కాలేదని, రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా అమలు చేయడానికే ఈ సామాజిక న్యాయ పోరాట జైత్రయాత్ర, సంకల్ప సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం అనగానే కొందరు తమ అవకాశాలు పోతాయని భయపడుతున్నారని, అలాంటి అపోహలు వీడాలని సూచించారు.

బీసీ రిజర్వేషన్ల అమలులో మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చూపిన చొరవను, తమిళనాడులో రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్పించి కాపాడిన మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణాల యువత, మహిళలు కూడా సామాజిక న్యాయం కోసం ముందుకు రావాలని కోరారు. దేశంలో ఇంకా లక్షలాది ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవం, జీవన ప్రమాణాలు పెంచే విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పదవుల్లో రాణించేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధించే వరకు ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

తెలంగాణలో సామాజిక న్యాయాన్ని టీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందన్నారు. సాహూ మహారాజ్, గౌతమ బుద్ధుడు, ఫూలే, అంబేడ్కర్ వారసులుగా సామాజిక న్యాయం చేసే తెలంగాణ సాధిస్తామని పేర్కొన్నారు.‌ తెలంగాణలో నేటికీ ఇంకా సామాజిక కుల వివక్ష జరుగుతుందని, అందుకే సామాజిక న్యా యం అందరికీ చేరవేసేలా సంకల్పం తీసుకున్నామని చెప్పారు. నేను అగ్రవర్ణంలో పుట్టినా అణగారిన వర్గాల కోసం పోరాటం చేయడానికి ముందుకు వచ్చానని స్పష్టం చేశారు. పుట్టుక నా చేతిలో లేదు... కానీ, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి అందించేందుకు నా చేతిలో ఉంది ఆ దిశగా ముందుకు వెళుతున్నాని పేర్కొన్నారు. సామాజిక న్యాయ సాధికారతం అందించే వరకు నా జీవితం అంకితం చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. సామాజిక ధర్మం పోరాటానికి అన్ని వర్గాలు తమ వెంట కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఎక్కడా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు ప్రేమలేఖలు రాసుకుంటారు.... గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తారని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే ఐదు నెలలు ప్రతి నియోజకవర్గం మండలాలలో న్యాయ తెలంగాణ సంకల్ప సభలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారోజు వీరన్న స్ఫూర్తితో సంక్రాంతి తర్వాత ఢిల్లీ బాట పట్టి కేంద్రం మెడలు వచ్చుతామని కవిత హెచ్చరించారు.

సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ తీర్మానాలు.

బీసీ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలి.

దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.

మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులకు భారతరత్న పురస్కారం ప్రకటించాలి.

ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలి.

ప్రొఫెసర్ జయశంకర్‌కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయాలి.

ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా దారి మళ్లకుండా వారి అభివృద్ధికే ఖర్చు చేయాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలన్నింటినీ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి.

ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించే చర్యలు చేపట్టాలి.

సావిత్రిబాయి పూలే జయంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో సామాజిక న్యాయ సంకల్ప సభలు నిర్వహించాలి.

ముస్లింలకు ఆర్థిక స్వావలంభనతో పాటు వక్ఫ్ బోర్డు చట్టం తేవాలి.

సిక్కులు, క్రిస్టియన్లకు ఆర్థిక స్వావలంభన ఉండేలా చర్యలు తీసుకోవాలి.

ట్రాన్స్ జండర్లకు సంపూర్ణ హక్కులు రావాలి.

వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్లు పెంచాలి.

వారికి కో ఆప్షన్ సభ్యుల్లో రిజర్వేషన్ కల్పించాలి.

సంక్రాంతి తర్వాత జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో భారీ ఉద్యమం చేస్తాం.

కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

Sthanikam

సామాజిక న్యాయమే లక్ష్యం.. బీసీలకు 50% రిజర్వేషన్ల వరకు పోరాటం. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News