Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నిరుపేదల పాలిట వరం సీఎం సహాయనిధి స్నేహితురాలి వేధింపులు.. విద్యార్థినిపై నలుగురి దాడి హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 07:12 PM

స్నేహితురాలి వేధింపులు.. విద్యార్థినిపై నలుగురి దాడి

15-09-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రియుడితో సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి.. నిరాకరించడంతో దాడి

వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌.. పోలీసుల దర్యాప్తు

స్నేహితురాలితో కలిసి చదువుకుంటున్న ఓ విద్యార్థినిపై నలుగురు యువతులు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో కలకలం రేపింది. సుమారు 38 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని అదే ప్రాంతానికి చెందిన యువకుడు కొంతకాలంగా వేధిస్తున్నట్లు సమాచారం. తనతో మాట్లాడాలంటూ వాట్సాప్‌లో పదేపదే సందేశాలు పంపడంతో ఆమె అతడిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదే సమయంలో బాధితురాలికి పరిచయమున్న మరో విద్యార్థిని.. తన స్నేహితుడైన ఆ యువకుడితో సంబంధం పెట్టుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.

అయితే బాధితురాలు అందుకు నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్న నలుగురు యువతులు పథకం ప్రకారం ఆమెను తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను తీవ్రంగా దూషిస్తూ దాడి చేశారు. ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఈ దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఘటనపై తీవ్ర చర్చ మొదలైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ నిందితులపై చట్టపరమైన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Sthanikam

స్నేహితురాలి వేధింపులు.. విద్యార్థినిపై నలుగురి దాడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News