భువనేశ్వర్ జూలో సందడి చేస్తున్న అరుదైన పిల్లలు
ఒడిశా అడవుల్లో లభ్యమైన అరుదైన ఒరంగుటాన్ పిల్లలు భువనేశ్వర్ జూలో సందడి చేస్తున్నాయి. మానవ జాతితో ఒరంగుటాన్లకు సుమారు 97 శాతం జన్యుపరమైన పోలికలు ఉండటంతో వాటి ప్రవర్తన కూడా మనుషుల పిల్లలను తలపిస్తోంది. చేతులతో పాల డబ్బాలను పట్టుకుని తాగడం, ఒకరినొకరు నెట్టుకుంటూ అల్లరి చేయడం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేక సంరక్షణ కేంద్రంలో సిబ్బంది వాటికి అవసరమైన ఆహారం అందిస్తూ ఆప్యాయంగా సంరక్షిస్తున్నారు. ఒక్కో ఒరంగుటాన్ పిల్ల విలువ సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అరుదైన జంతువులు కావడంతో వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి