రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో_ పుట్టపర్తి మండలంలో బాల్య వివాహ రహిత గ్రామాల కోసం చైతన్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం పెడబల్లి మరియు రాచువారిపల్లి గ్రామాల్లో బాల్య వివాహ రహిత ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు.మొదట పెడబల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి బొమ్మయ్య తో, గ్రామస్తులతో తమ గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
అనంతరం రాచువారిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ వెంకటప్ప తో, గ్రామస్తులతో తమ గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి, గ్రామస్తులు మాట్లాడుతూ..18 ఏళ్లు నిండని బాలికకు, 21 ఏళ్లు నిండని బాలుడికి వివాహం చేయబోమని, బాల్య వివాహం జరుగుతుంటే అడ్డుకుంటామని, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి