Sthanikam - Truth Matters
Logo

ఆదివాసీ అభ్యర్థులతోనే ఏజన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు చేపట్టాలి.

Updated : 22 Nov 2026 15:36 IST
As Preferred Source 1 min read
ఆదివాసీ అభ్యర్థులతోనే ఏజన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు చేపట్టాలి.

ఇల్లందు మండల కేంద్రంలో *TS ATF గుండాల మండల కమిటీ అత్యవసర సమావేశం* మండల అధ్యక్షులు కొరస ఆదినారాయణ గారి నాయకత్వంలో ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ప్రధానకార్యదర్శి కబ్బాకుల రవి, రాష్ట్ర కోశాధికారి ఉండం నాగేందర్ రావు, రాష్ట్ర కార్యదర్శి చాపల రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ..ఏజన్సీ ప్రాంతంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఆదివాసీ గిరిజన నిరుధ్యోగులతో మాత్రమే నియామకాలు, పదోన్నతులు భర్తీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ సంఘం ప్రతి సభ్యుడు సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. వృత్తి పరమైన పరిజ్ఞానం కలిగి ఉన్న TS ATF నాయకత్వంలో ఆదివాసీ టీచర్స్ యొక్క వృత్తి పరమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.ఏజెన్సీలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తూ జీ ఓ నెంబరు 3నీ సుప్రీంకోర్టులో రద్దుచేపించిన విషయాన్ని ఆదివాసీ ఉపాధ్యాయ సమాజం గుర్తించాలని డిమాండ్ చేశారు.వివిధ సంఘాలలో ఉన్న ఆదివాసీ గిరిజన ఉపాధ్యాయులు వాటిని విడనాడి TS ATF సంఘానికి మద్దతు తెలిపి సంఘాన్ని బలోపేతం చేసి ఆదివాసీ హక్కుల సాధనలో జీ ఓ నెంబరు 3 సాధనలో భాగ స్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఆదివాసీ ఉపాధ్యాయులు తలుచుకుంటే అదిలాబాద్ నుండి ఆశ్వరావు పేట వరకు గోదావరి పరివాహక ప్రాంతాలలో రాజకీయాలలో పెను మార్పులకు సృష్టించగలరని, ప్రభుత్వాలని మార్చగల శక్తి ఉందని అన్నారు.ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే వారిపట్ల మేధావులలైన ఆదివాసీ ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలని, ఆదివాసీ సమాజాన్ని చైతన్యం చేయాలని తెలిపారు.ఈ మండల కమిటీ సమావేశంలో TS,ATF జిల్లా కోశాధికారి పూనెం బాలరాజు, బొల్లి అంజయ్య, మండల ప్రధానకార్యదర్శి కల్తీ రామకృష్ణ, మండల కమిటీ నాయకులు ఈసం శ్రీనివాస్, చుంచు వెంకటేశ్వర్లు, కల్తీ సత్యం, కారం రాంబాబు, గొగ్గల బాబు, పూనెం సందీప్, ఊకె రామకృష్ణ, వాసం శ్రీరామ్, కల్తీ రాంబాబు, ఆరెం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదివాసీ అభ్యర్థులతోనే ఏజన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు చేపట్టాలి.

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి