Sthanikam - Truth Matters
Logo

బియ్యం నిల్వలు, నాణ్యతపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Updated : 04 Nov 2026 17:49 IST
As Preferred Source 1 min read
బియ్యం నిల్వలు, నాణ్యతపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

గోదాంలలో బియ్యం నిల్వలు, నాణ్యత, నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు.బుధవారం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఎస్‌డబ్ల్యూసీ గోదాంను కలెక్టర్, ఎస్పీ కె.నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, స్టాక్ రికార్డులను పరిశీలించి నమూనాలను పరీక్షించగా నాణ్యత సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు.పేదలకు పంపిణీ చేసే సన్న బియ్యం నాణ్యతను కాపాడాలని, ఎఫ్‌ఐఎఫ్‌ఓ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. గోదాంలో పనిచేస్తున్న హమాలీల విజ్ఞప్తి మేరకు జిల్లాలోని ఆరు బఫర్ గోదాంలలో పనిచేసే కార్మికులందరికీ లేబర్ కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.ఈ తనిఖీల్లో ఆర్డీఓ సూర్యనారాయణ, జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తహసీల్దార్ సంతోష్ కిరణ్, ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్ సందీప్,టెక్నికల్ అసిస్టెంట్లు భాస్కర్ రెడ్డి,అరుణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బియ్యం నిల్వలు, నాణ్యతపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి