ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పౌరసరఫరాల శాఖ పరిధిలో రైస్ మిల్లింగ్ వ్యవహారంలో బడా మిల్లర్ ఆగడాలు హద్దు మీరుతున్నాయి. పొరుగు రాష్ట్రం రాజస్థాన్ నుండి వచ్చి కొత్తగూడెంలో మకాం వేసిన జుగల్ అనే మిల్లర్ అసోసియేషన్ ముసుగులో జిల్లాను ఏలుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అసోసియేషన్ నేతగా చలామణి అవుతూ చిన్న మిల్లర్లను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. తన మాట వినని మిల్లర్లను బ్లాక్ లిస్ట్ చేస్తానని, కోటా ఇప్పించనని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
2022-23 టెండర్ పాట వ్యవహారంలో భారీ అవకతవకలు జరిగినట్లు సమాచారం. టెండర్ పాట పేరుతో చిన్న మిల్లర్ల నుండి లక్షల్లో వసూలు చేసి, ఆ సొమ్మును తన అనుచరులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే అసలు గుట్టు బయటపడుతుందని మిల్లర్లు కోరుతున్నారు.
జిల్లాలో చిన్న మిల్లర్లపై నిబంధనలు కఠినంగా అమలు చేస్తూ, పలుకుబడి ఉన్న బడా మిల్లర్లకు మాత్రం మినహాయింపు ఇస్తున్న తీరుపై అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి...
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి