హైదరాబాద్‌కు చెందిన ముడిదాపు కుమార్ (22) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ నెల 21న బుధవారం హైదరాబాద్ నుంచి విజయవాడకు పల్సర్ బైక్‌పై వెళ్తుండగా మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి ఈశ్వరి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మునగాల ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి