Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:26 AM

తెలంగాణలో విస్తరణకు సమష్టి కృషి అవసరం: సురేంద్ర మోహన్‌.

06-10-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రైతుకు లాభం.. హెచ్‌డీపీఎస్‌తోనే సాధ్యం.

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 స్థానికం ప్రతినిధి:

పత్తి రైతుల ప్రయోజనాల కోసం హైడెన్సిటీ ప్లాంటింగ్‌ సిస్టమ్‌ (హెచ్‌డీపీఎస్‌)ను తెలంగాణలో విస్తృతంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తుల విభాగం కమిషనర్‌, వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్‌ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సంస్కరణల ఉత్సవం–2026’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

హెచ్‌డీపీఎస్‌తో సంప్రదాయ సాగుతో పోలిస్తే దిగుబడులు పెరగడంతోపాటు కూలీల కొరతను అధిగమించవచ్చని తెలిపారు. యాంత్రీకరణకు అనుకూలంగా ఉండటంతోపాటు కలుపు నివారణ, పెట్టుబడి వ్యయాల తగ్గింపునకు ఈ విధానం దోహదపడుతుందన్నారు. రైతులు ఈ ఆధునిక సాగు విధానాన్ని అవలంబించేలా ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ సంస్థలు, పరిశ్రమలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.పత్తి, జౌళి రంగాల అభివృద్ధికి రైతులు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. డిజిటల్‌ మార్పులు, ఉత్పాదకత పెంపు, కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు, నాణ్యత మెరుగుదల, వ్యాపార నిర్వహణ సౌలభ్యంపై చర్చలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో సీసీఐ సీఎండీ లలిత్‌ కుమార్‌ గుప్తా, సహకార శాఖ ప్రత్యేక కమిషనర్‌ రాహుల్‌ రాజ్‌ పి.ఎస్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన విభాగం సంచాలకుడు డాక్టర్‌ ఎం.బలరాం, పత్తి రైతులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణలో విస్తరణకు సమష్టి కృషి అవసరం: సురేంద్ర మోహన్‌.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News