హైదరాబాద్: 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండానే నివాస వినియోగంలోకి వచ్చిన అర్హత కలిగిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేసింది. సంబంధిత నాలా రుసుమును చెల్లించిన అనంతరం అర్హత ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఈ మేరకు రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. అర్హత కలిగిన దరఖాస్తులను నిర్ణీత విధానంలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. 22ఏ కింద ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన భూముల యజమానులకు తాజా నిర్ణయం ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.
ఇప్పటికే చట్టబద్ధమైన లేఅవుట్, భవన నిర్మాణం, అపార్ట్‌మెంట్ అనుమతులు ఉన్న 22ఏ జాబితాలోని కొన్ని ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతులు కల్పించింది. అర్హతను భూమి రికార్డులు, అనుమతులు, న్యాయపరమైన అంశాల ఆధారంగా పరిశీలించనున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి