Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:01 AM

పీఎం జ్ఞాపికల ఇ-వేలం షురూ.

పీఎం జ్ఞాపికల ఇ-వేలం షురూ.

పీఎం జ్ఞాపికల ఇ-వేలం షురూ.
17-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.13.50 లక్షల శ్రీరాముడి జ్ఞాపిక.. వేలంలో ప్రత్యేక ఆకర్షణ.

జ్ఞాపికల వేలం ఆదాయం ‘నమామి గంగే’కు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో అందిన జ్ఞాపికల ఇ-వేలం 8వ ఎడిషన్‌ గురువారం ప్రారంభమైంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఈ వేలాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్‌ 17 నుంచి అధికారిక వెబ్‌ పోర్టల్‌ www.pmmementos.gov.in ద్వారా ఇ-వేలం ప్రారంభమైంది.

ఈసారి 1,498 జ్ఞాపికలను వేలానికి ఉంచారు. దేశంలోని కళలు, సంప్రదాయ హస్తకళలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సాంస్కృతిక వైవిధ్యం, క్రీడా విజయాలను ప్రతిబింబించే వస్తువులు ఇందులో ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, అస్సాం, బిహార్‌, ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో జ్ఞాపికలను సేకరించినట్లు మంత్రి తెలిపారు.

రూ.13.50 లక్షల శ్రీరాముడి జ్ఞాపిక.

వేలంలో 50 ప్రత్యేక వస్తువులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కర్ణాటకకు చెందిన వెండి శ్రీరాముడి జ్ఞాపికకు రూ.13.50 లక్షల కనీస ధర నిర్ణయించారు. కాకతీయ కళాతోరణం వెండి ప్రతిమకు రూ.9 లక్షలు, ట్రీ ఆఫ్‌ లైఫ్‌ గోండ్‌ ఆర్ట్‌ పెయింటింగ్‌కు రూ.7.50 లక్షలు, జగన్నాథ పరివార్‌ రథానికి రూ.6 లక్షల కనీస ధరగా నిర్ణయించారు.

జ్ఞాపికల వేలం ఆదాయం ‘నమామి గంగే’కు

పీఎం జ్ఞాపికల ఇ-వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ‘నమామి గంగే’ కార్యక్రమానికి కేటాయించనున్నట్లు షెకావత్‌ తెలిపారు. భారతీయ కళా, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతోపాటు గంగా నది పునరుజ్జీవనం, సంరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలు, కలెక్టర్లు, సంస్థలు, కళాభిమానులు వేలంలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కోరింది. వేలానికి ముందు జ్ఞాపికలను ప్రత్యేక ప్రదర్శనలో వీక్షించే అవకాశం కల్పించారు. న్యూఢిల్లీలోని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌ ఆధ్వర్యంలో ప్రదర్శన, డాక్యుమెంటేషన్‌, నిర్వహణ ఏర్పాట్లు చేపట్టారు.

Sthanikam

పీఎం జ్ఞాపికల ఇ-వేలం షురూ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News