Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:39 AM

నేపాల్ వరదల్లో నల్లగొండ యువతి గల్లంతు. మానస సరోవరం యాత్రకు వెళ్లి.. ఆచూకీ లేక కుటుంబంలో ఆందోళన.

27-08-2026 414 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన సుహాసిని రెడ్డి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మానస సరోవరం యాత్రకు వెళ్లిన ఆమె మంగళవారం రాత్రి నుంచి ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఎల్బీనగర్‌ పరిధిలోని వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి కుటుంబం కొంతకాలంగా అక్కడే నివసిస్తోంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కందిమల్ల మహేందర్‌రెడ్డి కుమార్తె సుహాసిని ఉన్నత విద్యను అభ్యసించారు. 2004లో మునుగోడు మండలం గూడపూర్‌కు చెందిన సంజీవరెడ్డితో ఆమెకు వివాహమైంది. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. న్యూజిలాండ్‌లో కొంతకాలం నివసించిన వారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.

మూడు నెలల క్రితమే యాత్రకు బుకింగ్‌

ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉన్న సుహాసిని ఈ నెల 19న హైదరాబాద్‌కు వచ్చారు. అనంతరం స్నేహితురాలితో కలిసి మానస సరోవరం యాత్రకు వెళ్లేందుకు మూడు నెలల క్రితమే టికెట్లు బుక్‌ చేసుకున్నారు. సుహాసిని హైదరాబాద్‌ నుంచి నేపాల్‌కు వెళ్లగా, ఆమె స్నేహితురాలు ఆస్ట్రేలియా నుంచి ఖాట్మండుకు చేరుకుంది. ఆదివారం ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. అనంతరం టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ద్వారా 29 మంది బృందంతో మానస సరోవరం యాత్రకు బయలుదేరినట్లు సుహాసిని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

మంగళవారం రాత్రి నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌

మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సుహాసిని ఫోన్‌ అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె వెళ్లిన ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినట్లు తెలియడంతో ఆందోళన మరింత పెరిగింది. సుహాసిని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పలువిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

యాత్రికుల సమాచారం ఇవ్వాలని వేడుకోలు

మానస సరోవరం యాత్రకు వెళ్లిన సుహాసినితో పాటు ఇతర యాత్రికుల భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం వెంటనే నేపాల్‌లో ఉన్న మానస సరోవరం యాత్రికుల వివరాలను వెల్లడించి, వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Sthanikam

నేపాల్ వరదల్లో నల్లగొండ యువతి గల్లంతు. మానస సరోవరం యాత్రకు వెళ్లి.. ఆచూకీ లేక కుటుంబంలో ఆందోళన.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News