Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

అవినీతిపై బ్రిక్స్ ఫోకస్ హైదరాబాద్‌లో నేటి నుంచి కీలక సమావేశాలు.

03-08-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిపై చర్చలు.

డిజిటల్ యుగంలో అవినీతి నిరోధానికి ఉమ్మడి కార్యాచరణ.

బ్రిక్స్ అధ్యక్ష దేశంగా భారత్‌కు కీలక ఘట్టం.

బ్రిక్స్–2026కు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఆధ్వర్యంలో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం (ఏసీడబ్ల్యూజీ) రెండో సమావేశం, ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశం ఆగస్టు 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్నాయి. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది.

'స్థిరత్వం–ఆవిష్కరణ–సహకారం–సుస్థిరత కోసం నిర్మాణం' అనే బ్రిక్స్-2026 ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు బ్రిక్స్ సభ్యదేశాల ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, అవినీతి నిరోధక సంస్థల ప్రతినిధులు, న్యాయ అమలు సంస్థల అధికారులు హాజరుకానున్నారు. డీవోపీటీ కార్యదర్శి రచనా షా సమావేశాలను ప్రారంభించనున్నారు.

జూన్‌లో జరిగిన తొలి వర్చువల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై హైదరాబాద్ సమావేశంలో సమీక్ష చేపట్టనున్నారు. సీమాంతర అవినీతి నిరోధం, అక్రమ ఆస్తుల రికవరీ, పారదర్శక పాలన, జవాబుదారీతనం పెంపుపై సభ్యదేశాలు కార్యాచరణను ఖరారు చేయనున్నాయి.

ఆగస్టు 5న 'ఆవిష్కరణ–సాంకేతిక ఆధారిత.

వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన' అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. డిజిటల్ ప్రభుత్వ కొనుగోళ్లు, ఫిన్‌టెక్, డిజిటల్ ఆస్తుల వల్ల ఏర్పడుతున్న అవినీతి ప్రమాదాల నివారణ, సాంకేతిక ఆధారిత పారదర్శక పాలనపై సభ్యదేశాలు అనుభవాలను పంచుకోనున్నాయి.

భారత్ అధ్యక్షతలో జరుగుతున్న బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం చివరి సమావేశం ఇదే కావడంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశం ద్వారా అవినీతి నిరోధం, ఆస్తుల రికవరీ, సాంకేతిక ఆధారిత పాలనలో బ్రిక్స్ దేశాల మధ్య దీర్ఘకాలిక సహకారానికి మరింత బలం చేకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

అవినీతిపై బ్రిక్స్ ఫోకస్ హైదరాబాద్‌లో నేటి నుంచి కీలక సమావేశాలు.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News