Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:08 PM

ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం

26-07-2026 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో శిశిర హాస్పిటల్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ & టెస్టింగ్ సెంటర్‌ను మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధు మాధవనేని మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నివారణకు సంబంధించిన సూచనలు అందించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సేవలు కొనసాగాయి. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు, కేంద్రానికి అవసరమైన వంటశాల, గోదాం నిర్మాణాన్ని ఎంపీ నిధులతో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైద్యుల విధుల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరు సంగమేశ్వర్, పట్టణ మాజీ అధ్యక్షుడు కే. శ్రీనివాస్, మండల అధ్యక్షురాలు ఓదెల రాజేశ్వరి, కర్ణ ఆదిత్య, ఉషన్న, శ్రీశైలం, కావలి అనిత, నామ హరీష్, ఉక్కిస భరత్, గొర్లిల్ల శివలింగం, తోట చంద్రశేఖర్, శ్రీకాంత్ రాజ్, శ్రీశైలం యాదవ్, గణపురం చంద్రశేఖర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News