Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

విలన్ పాత్రలకు ప్రాణం పోసిన ప్రదీప్ సింగ్ రావత్ ఇకలేరు

05-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ముంబయి, ఆగస్టు 5: భారత సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడతో పాటు పలు భారతీయ భాషల్లో నటించిన ప్రదీప్ సింగ్ రావత్ తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్యంగా తెలుగులో 'సై', 'ఛత్రపతి', 'గజిని' చిత్రాల్లో ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు సినీ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచాయి.

హిందీ టెలివిజన్‌లో ప్రసారమైన 'మహాభారత్' సీరియల్‌లో అశ్వత్థామ పాత్ర ద్వారా కూడా ఆయన విశేష గుర్తింపు పొందారు. విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

ప్రదీప్ సింగ్ రావత్ మృతితో భారత సినీ పరిశ్రమ ఓ విలక్షణ నటుడిని కోల్పోయిందని సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

విలన్ పాత్రలకు ప్రాణం పోసిన ప్రదీప్ సింగ్ రావత్ ఇకలేరు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News