Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:05 PM

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఐదు కొత్త కోర్సులకు అనుమతి.. త్వరలో అడ్మిషన్ నోటిఫికేషన్

16-07-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, జూలై 15: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఐదు కొత్త కోర్సులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. విద్యా, సామాజిక సేవ, భౌగోళిక శాస్త్ర రంగాల్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ కోర్సులకు అనుమతి లభించిందన్నారు.

యూజీసీ ఆమోదం పొందిన కోర్సుల్లో ఎం.ఏ. ఎడ్యుకేషన్, ఎం.ఏ. ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్‌డబ్ల్యూ), ఎం.ఎస్‌సీ జియోగ్రఫీ, బి.ఎడ్. (స్పెషల్ ఎడ్యుకేషన్) (అనుమతి పునరుద్ధరణ) ఉన్నాయి.

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. జూన్ నెలలో యూజీసీ నిపుణుల కమిటీ వర్చువల్‌ విధానంలో యూనివర్సిటీని పరిశీలించి, మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది, విద్యా ప్రమాణాలను సమీక్షించిన అనంతరం ఈ కోర్సులకు ఆమోదం తెలిపిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ కోర్సులను రూపొందించామని, ముఖ్యంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా (ఐఏఎస్) సూచనల మేరకు టీచర్ల నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా కోర్సులు రూపొందించామని చెప్పారు. ఈ సందర్భంగా యూజీసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఎం.ఏ. ఎడ్యుకేషన్, ఎం.ఏ. స్కూల్ అడ్మినిస్ట్రేషన్, బి.ఎడ్. (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సులు సేవలో ఉన్న ఉపాధ్యాయుల విద్యార్హతలు, నాయకత్వ లక్షణాలు, పాఠశాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖతో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు.

మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎం.ఎస్‌సీ జియోగ్రఫీ కోర్సులకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ కోర్సులకు సంబంధించిన అర్హతలు, ప్రవేశ విధానం, ఫీజులు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్ల వివరాలతో త్వరలో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

విద్యార్థులు తాజా సమాచారం కోసం BRAOU అధికారిక వెబ్‌సైట్‌ను లేదా హెల్ప్‌డెస్క్ 040-23680333, 040-23680555 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Sthanikam

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఐదు కొత్త కోర్సులకు అనుమతి.. త్వరలో అడ్మిషన్ నోటిఫికేషన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News