Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:47 AM

పూర్వ విద్యార్థుల పెద్ద మనసు.. పాఠశాలలకు కానుకలు, స్నేహితుల కుటుంబాలకు అండ

18-07-2026 565 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం, పెద్దకాపర్తి:

సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో పెద్దకాపర్తి గ్రామానికి చెందిన 2000–2001 విద్యాసంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి తమ వంతు సహకారంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్రింటర్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు టీవీని విరాళంగా అందజేశారు.

అంతేకాకుండా, తమతో కలిసి చదువుకుని అకాల మరణం చెందిన సహచరుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ కార్యక్రమం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు అందించిన ప్రింటర్, టీవీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడతాయని తెలిపారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు సామాజిక బాధ్యతతో ముందుకు రావడం గర్వకారణమని పేర్కొన్నారు.గ్రామస్థులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు చేపట్టిన సేవా కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. పాఠశాలల అభివృద్ధితో పాటు అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏర్పుల భాస్కర్, ఎడ్ల నరేష్, పోశపోయిన యాదయ్య, మునుకుంట్ల రాజు, ఏర్పుల మురళి, తెల్సూరి నాగేష్, నూతి సత్యనారాయణ, జుంజు రాజు, జి.శంకర్, తాటి జానయ్య, ఎస్.రామకృష్ణ, ఏ.అంజి, ఏర్పుల రవి, బత్తుల రమేష్, ఆరూరి రమేష్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పూర్వ విద్యార్థుల పెద్ద మనసు.. పాఠశాలలకు కానుకలు, స్నేహితుల కుటుంబాలకు అండ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News