Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:50 AM

13 ఏళ్ల వివాదానికి ఫుల్‌స్టాప్‌..! టూటౌన్ పోలీసుల చొరవతో స్వాతంత్ర్య సమరయోధుల భవనం ఖాళీ

18-07-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డీఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎస్ఐ సైదాబాబు.. కమిటీ సభ్యుల ప్రశంసలు

నల్లగొండ టౌన్: దశాబ్దానికి పైగా పరిష్కారం కాని అద్దె వివాదానికి టూటౌన్ పోలీసులు ముగింపు పలికారు. స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో 2011 నుంచి అద్దెకు నివాసం ఉంటూ, చాలా కాలంగా అద్దె చెల్లించకుండా భవనాన్ని ఖాళీ చేయని వ్యక్తిని పోలీసులు చట్టబద్ధంగా కౌన్సెలింగ్ నిర్వహించి భవనాన్ని ఖాళీ చేయించారు.

పట్టణంలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో వెంకటరమణ అనే వ్యక్తి 2011 నుంచి నివాసం ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా అద్దె చెల్లించకపోవడంతో పాటు భవనాన్ని ఖాళీ చేయకపోవడంతో యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సమస్యను స్వాతంత్ర్య సమరయోధుల కమిటీ ప్రతినిధులు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

డీఎస్పీ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్ఐ సైదాబాబు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అద్దెదారుడితో చట్టపరంగా చర్చించి, కౌన్సెలింగ్ నిర్వహించడంతో భవనాన్ని స్వచ్ఛందంగా ఖాళీ చేయించారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యను వేగంగా పరిష్కరించిన టూటౌన్ పోలీసుల పనితీరును స్వాతంత్ర్య సమరయోధుల కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ ఉమారాణి, కమిటీ ప్రతినిధి కొప్పు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

13 ఏళ్ల వివాదానికి ఫుల్‌స్టాప్‌..! టూటౌన్ పోలీసుల చొరవతో స్వాతంత్ర్య సమరయోధుల భవనం ఖాళీ

Article Image

డీఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎస్ఐ సైదాబాబు.. కమిటీ సభ్యుల ప్రశంసలు

నల్లగొండ టౌన్: దశాబ్దానికి పైగా పరిష్కారం కాని అద్దె వివాదానికి టూటౌన్ పోలీసులు ముగింపు పలికారు. స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో 2011 నుంచి అద్దెకు నివాసం ఉంటూ, చాలా కాలంగా అద్దె చెల్లించకుండా భవనాన్ని ఖాళీ చేయని వ్యక్తిని పోలీసులు చట్టబద్ధంగా కౌన్సెలింగ్ నిర్వహించి భవనాన్ని ఖాళీ చేయించారు.

పట్టణంలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో వెంకటరమణ అనే వ్యక్తి 2011 నుంచి నివాసం ఉంటున్నాడు. అయితే కొంతకాలంగా అద్దె చెల్లించకపోవడంతో పాటు భవనాన్ని ఖాళీ చేయకపోవడంతో యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సమస్యను స్వాతంత్ర్య సమరయోధుల కమిటీ ప్రతినిధులు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

డీఎస్పీ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్ఐ సైదాబాబు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అద్దెదారుడితో చట్టపరంగా చర్చించి, కౌన్సెలింగ్ నిర్వహించడంతో భవనాన్ని స్వచ్ఛందంగా ఖాళీ చేయించారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యను వేగంగా పరిష్కరించిన టూటౌన్ పోలీసుల పనితీరును స్వాతంత్ర్య సమరయోధుల కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ ఉమారాణి, కమిటీ ప్రతినిధి కొప్పు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News