Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 08:47 AM

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ లేదా..? బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్

18-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి, జూలై 18: యాదాద్రి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు శివచరణ్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

చింతలకుంటలోని ఈశ్వరమ్మ యాదవ్ నివాసానికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆమెను పరామర్శించి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న మహిళా నాయకురాలిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ఉన్న నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బాధ్యుడిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితురాలికి రక్షణ కల్పించకుండా, వివాదంలో ఉన్న నాయకుడికి భద్రత కల్పించడం బీసీలను అవమానించడమేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రానున్న రోజుల్లో బహుజనులు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రుద్రవరం సునీల్ కుమార్, పోకల ఎలిజబెత్తో పాటు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు

Sthanikam

ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ లేదా..? బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్

Article Image

చైతన్యపురి, జూలై 18: యాదాద్రి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు శివచరణ్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

చింతలకుంటలోని ఈశ్వరమ్మ యాదవ్ నివాసానికి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆమెను పరామర్శించి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న మహిళా నాయకురాలిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత ఉన్న నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బాధ్యుడిపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితురాలికి రక్షణ కల్పించకుండా, వివాదంలో ఉన్న నాయకుడికి భద్రత కల్పించడం బీసీలను అవమానించడమేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల వివక్షతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రానున్న రోజుల్లో బహుజనులు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రుద్రవరం సునీల్ కుమార్, పోకల ఎలిజబెత్తో పాటు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News