Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండకు వెంటనే పూర్తి స్థాయి మున్సిపల్ కమిషనర్‌ను నియమించాలి: CM రేవంత్ రెడ్డికి BJP OBC మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్ బహిరంగ లేఖ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 17, 2026 09:22 PM

నీట్–2026లో ఎస్‌ఆర్ జైత్రయాత్ర..! ఆలిండియా 9వ ర్యాంకు... 16 మందిలో 12 మందికి ఎంబీబీఎస్ సీట్లు

నీట్–2026లో ఎస్‌ఆర్ జైత్రయాత్ర..! ఆలిండియా 9వ ర్యాంకు... 16 మందిలో 12 మందికి ఎంబీబీఎస్ సీట్లు

నీట్–2026లో ఎస్‌ఆర్ జైత్రయాత్ర..! ఆలిండియా 9వ ర్యాంకు...  16 మందిలో 12 మందికి ఎంబీబీఎస్ సీట్లు
July 17, 2026 08:27 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 9వ ర్యాంకుతో మెరిసిన వీరయ్య సహ్యూ

నల్గొండ రామగిరి బ్రాంచ్‌లో 16 మందిలో 12 మందికి ఎంబీబీఎస్ సీట్లు

దేశవ్యాప్తంగా గురువారం విడుదలైన నీట్–2026 ఫలితాల్లో నల్గొండకు చెందినఎస్‌ఆర్ విద్యాసంస్థలు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నాయి. ఆ సంస్థ విద్యార్థి వీరయ్య సహ్యూ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో9వ ర్యాంకు సాధించి రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. 720 మార్కులకు గాను 705 మార్కులుసాధించి ఈ అరుదైన ఘనతను అందుకున్నట్లు ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వర దారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం మంచి ఫలితాలే కాకుండా జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ద్వారా ఎస్‌ఆర్ విద్యాసంస్థలు విద్యారంగంలో తమ ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారమే ఈ విజయాలకు కారణమని అన్నారు.

అదేవిధంగా నల్గొండ పట్టణంలోని రామగిరి బ్రాంచ్ ఎస్‌ఆర్ కాలేజీలో నీట్ లాంగ్‌టర్మ్ కోర్సు అభ్యసించిన 16 మంది విద్యార్థుల్లో 12 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించే ర్యాంకులు పొందడం విశేషమన్నారు. ఈ ఫలితాలు విద్యాసంస్థలో అందిస్తున్న నాణ్యమైన శిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఎంబీబీఎస్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను నల్గొండ ఎస్‌ఆర్ కాలేజీ జోనల్ ఇన్‌చార్జి దోనల శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపక బృందంతో కలిసి అభినందించారు. విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి వారి విజయాలను కొనియాడారు.

ఈ సందర్భంగా దోనల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అంకితభావం, పట్టుదల వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి ప్రత్యేక అధ్యయన ప్రణాళికలు అమలు చేయడం వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.

విద్యార్థులు కూడా తమ విజయానికి అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధాన కారణమని పేర్కొన్నారు. నిరంతర సాధన, మాక్ టెస్టులు, సమయపాలన, ఆత్మవిశ్వాసంతో చదవడం వల్లే మంచి ర్యాంకులు సాధించగలిగామని చెప్పారు.

నీట్–2026లో సాధించిన ఈ విజయాలతో ఎస్‌ఆర్ విద్యాసంస్థలు మరోసారి నల్గొండ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా తమ శిక్షణ కొనసాగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆలిండియా 9వ ర్యాంకు సాధించిన వీరయ్య సహ్యూతో పాటు ఎంబీబీఎస్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అధ్యాపకులు, తల్లిదండ్రులు, సహ విద్యార్థులు ఘనంగా అభినందించి, వారి ఉన్నత విద్యాభ్యాసంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News