Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:43 AM

స్వాతంత్ర్య సమరయోధుల భవనం ఖాళీ..

స్వాతంత్ర్య సమరయోధుల భవనం ఖాళీ..

స్వాతంత్ర్య సమరయోధుల భవనం ఖాళీ..
17-07-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

టూటౌన్ ఎస్ఐ సైదా బాబు చొరవ..

2011 నుంచి అద్దె చెల్లించకుండా మొండికేసిన కిరాయిదారుడు..

డీఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగి సమస్య పరిష్కరించిన పోలీసులు..

నల్గొండ : పట్టణంలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యను నల్గొండ టూటౌన్ పోలీసులు చాకచక్యంగా పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక స్వాతంత్ర్య సమరయోధుల భవనంలో వెంకటరమణ అనే వ్యక్తి 2011 నుంచి అద్దెకు నివాసం ఉంటున్నాడు. అయితే, గత కొంతకాలంగా అతను భవన యాజమాన్యానికి అద్దె చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన స్వాతంత్ర్య సమరయోధుల కమిటీ ప్రతినిధులు తమ సమస్యను నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్ఐ సైదాబాబు తక్షణమే స్పందించారు. స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అద్దెదారుడితో చట్టబద్ధమైన విధానంలో మాట్లాడి, కౌన్సిలింగ్ నిర్వహించి భవనాన్ని ఖాళీ చేయించారు.

పోలీసులకు కృతజ్ఞతలు..

​చాలా కాలంగా నలుగుతున్న సమస్యను సకాలంలో స్పందించి పరిష్కరించిన టూటౌన్ ఎస్ఐ సైదాబాబుకు స్వాతంత్ర్య సమరయోధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, సేవాభావంతో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారుల తీరును వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ ఉమారాణి, కమిటీ ప్రతినిధి కొప్పు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వాతంత్ర్య సమరయోధుల భవనం ఖాళీ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News