Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:10 AM

కళ్లకు గంతలు.. ఫ్లైఓవర్‌కు గండాలు!

కళ్లకు గంతలు.. ఫ్లైఓవర్‌కు గండాలు!

కళ్లకు గంతలు.. ఫ్లైఓవర్‌కు గండాలు!
17-07-2026 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాలలో బీఆర్ఎస్ వినూత్న నిరసన.. నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్.

నల్గొండ జిల్లా

చిట్యాల పట్టణ కేంద్రంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల ఆలస్యంపై బీఆర్ఎస్ నాయకులు గురువారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళనకు దిగిన వారు, పనుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై అత్యంత రద్దీ ప్రాంతమైన చిట్యాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం నత్తనడకన సాగుతుండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతుండటంతో ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కాంట్రాక్టర్ ఇప్పటివరకు పనుల పురోగతిపై స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఫ్లైఓవర్ పనుల కారణంగా పట్టణ ప్రజలు రోడ్లు దాటడానికే నరకయాతన అనుభవిస్తున్నారని, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్న ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పనులు పూర్తి కాకపోతే ప్రజలతో కలిసి మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

కళ్లకు గంతలు.. ఫ్లైఓవర్‌కు గండాలు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News