Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 06:11 AM

కాంగ్రెస్‌లో కొత్త మార్గదర్శకాలు..! పాలాభిషేకాలు, క్రేన్ తో గజమాలలకు బ్రేక్

16-07-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కాంగ్రెస్ పార్టీ నేతల ఫోటోలకు పాలాభిషేకాలు చేయడం, క్రేన్ ల తో భారీ గజమాలలు వేయడం వంటి ఆర్భాట కార్యక్రమాలను నిలిపివేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచించినట్లు సమాచారం.

నేతల పట్ల అభిమానాన్ని చాటుకునే పేరుతో నిర్వహిస్తున్న అతిశయ ప్రదర్శనలు పార్టీ సంస్కృతికి విరుద్ధమని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపైనే నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇకపై నేతల ఫోటోలకు పాలాభిషేకాలు, క్రేన్ లతో గజమాలలు, భారీ కటౌట్లు, ఆడంబర స్వాగత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు సమాచారం. సాధారణ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ కార్యకలాపాల్లో నిరాడంబరత పాటించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయంతో పార్టీ కార్యక్రమాల్లో ఆర్భాటాలకు చెక్ పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Sthanikam

కాంగ్రెస్‌లో కొత్త మార్గదర్శకాలు..! పాలాభిషేకాలు, క్రేన్ తో గజమాలలకు బ్రేక్

Article Image

కాంగ్రెస్ పార్టీ నేతల ఫోటోలకు పాలాభిషేకాలు చేయడం, క్రేన్ ల తో భారీ గజమాలలు వేయడం వంటి ఆర్భాట కార్యక్రమాలను నిలిపివేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచించినట్లు సమాచారం.

నేతల పట్ల అభిమానాన్ని చాటుకునే పేరుతో నిర్వహిస్తున్న అతిశయ ప్రదర్శనలు పార్టీ సంస్కృతికి విరుద్ధమని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపైనే నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇకపై నేతల ఫోటోలకు పాలాభిషేకాలు, క్రేన్ లతో గజమాలలు, భారీ కటౌట్లు, ఆడంబర స్వాగత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు సమాచారం. సాధారణ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ కార్యకలాపాల్లో నిరాడంబరత పాటించాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయంతో పార్టీ కార్యక్రమాల్లో ఆర్భాటాలకు చెక్ పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News