Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:08 AM

పదేళ్ల సమస్యకు సొంత ఖర్చుతో చెక్.. వెలిమినేడులో వార్డు సభ్యుడి చొరవ

17-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం, వెలిమినేడు:

గ్రామంలోని 9వ వార్డులో గత పదేళ్లుగా అండర్ డ్రైనేజ్ మ్యాన్‌హోల్స్ (మ్యానువల్స్) తెరవకపోవడంతో తీవ్ర పారిశుద్ధ్య సమస్య నెలకొంది. మురుగునీటి నిల్వలు, దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు.

ఈ పరిస్థితిని గుర్తించిన 9వ వార్డు సభ్యుడు మహంకాళి లింగస్వామి తన సొంత ఖర్చులతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి, మూసుకుపోయిన మ్యాన్‌హోల్స్‌ను తెరిపించి సమస్యను పరిష్కరించారు. దీంతో వార్డులో మురుగునీటి ప్రవాహం సక్రమంగా సాగడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.దశాబ్దకాలంగా పేరుకుపోయిన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వార్డు సభ్యుడు స్వయంగా ముందుకు రావడం గ్రామంలో చర్చనీయాంశమైంది. స్థానికులు ఆయన సేవాభావాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గోలి నరేష్, వేషాల శంకరయ్య, గుండ్లపల్లి మధు, కంచుకోముల మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

"ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పదేళ్ల నిర్లక్ష్యానికి ప్రజాప్రతినిధి చొరవతో ముగింపు" అంటూ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

పదేళ్ల సమస్యకు సొంత ఖర్చుతో చెక్.. వెలిమినేడులో వార్డు సభ్యుడి చొరవ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News