Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:10 AM

భూ వివాదాలకు చెక్.. రైతులకు భరోసా

భూ వివాదాలకు చెక్.. రైతులకు భరోసా

భూ వివాదాలకు చెక్.. రైతులకు భరోసా
17-07-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం సాధ్యం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.

మిర్యాలగూడ: భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి రైతులకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిస్టాపురం గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల రీ-సర్వే అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దశాబ్దాలుగా రైతులను వేధిస్తున్న భూ సమస్యలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న రీ-సర్వే ద్వారా శాశ్వత ముగింపు లభిస్తుందని పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాలతో భూముల కొలతలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని, సరిహద్దుల నిర్ధారణలో ఎలాంటి సందేహాలకు తావు ఉండదని స్పష్టం చేశారు.భూముల రికార్డులను కచ్చితత్వంతో నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా నివారించవచ్చని తెలిపారు. రైతులు అపోహలకు లోనుకాకుండా క్షేత్రస్థాయిలో అధికారులకు సహకరించి రీ-సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

భూ వివాదాలకు చెక్.. రైతులకు భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News