Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపాధి నైపుణ్యాలపై శిక్షణ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 07:09 AM

సిరిపురంలో బెల్ట్ షాపులకు గ్రామం నుంచి బహిష్కరణ. మద్యరహిత గ్రామంగా సిరిపురాన్ని తీర్చిదిద్దుతాం. సర్పంచ్ అంబటి

17-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ మహిళల సహకారంతో అక్రమ మద్యం బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గ్రామ సభతో పాటు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళలు, యువత, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామంలో బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, బెల్ట్ షాపుల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, మహిళలపై వేధింపులు, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, గ్రామంలో ఒక్క బెల్ట్ షాపుకూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.

సిరిపురాన్ని మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. ముఖ్యంగా మహిళా సంఘాలు ముందుండి గ్రామంలో మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేయడం అభినందనీయం. యువత మద్యానికి దూరంగా ఉండాలి. గ్రామాభివృద్ధికి ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు రావాలి" అని ఆమె పిలుపునిచ్చారు.అనంతరం పంచాయతీ కార్యదర్శి యమ్ . జ్యోతి మాట్లాడుతూ, గ్రామంలో మద్యం నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామ సభలో మహిళా సంఘాల ప్రతినిధులు బెల్ట్ షాపుల నిర్మూలనకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించి, గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలను అడ్డుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

.

Sthanikam

సిరిపురంలో బెల్ట్ షాపులకు గ్రామం నుంచి బహిష్కరణ. మద్యరహిత గ్రామంగా సిరిపురాన్ని తీర్చిదిద్దుతాం. సర్పంచ్ అంబటి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News