Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:43 PM

సాయిబాబాపై అసత్య ప్రచారాలు ఆపాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ఓయూ విద్యార్థి నాయకులు

16-07-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం–సిద్ధగురు రమణానంద మహర్షి ఆశ్రమంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, షిరిడి సాయిబాబాపై కొందరు చేస్తున్న విమర్శలు, అసత్య ప్రచారాలు కోట్లాది మంది సాయి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

సిద్ధగురు రమణానంద మహర్షి సాయిబాబా పక్షాన నిలబడి "శత ప్రశ్న శరసంధానం" గ్రంథం ద్వారా సాయి వ్యతిరేక ప్రచారాలకు సమాధానం ఇచ్చారని కొనియాడారు. సాయి భక్తులైన తాము కూడా మహర్షికి అండగా నిలిచి సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలో సామూహికంగా మహాపీఠాన్ని సందర్శించి తమ మద్దతును ప్రకటిస్తామని వెల్లడించారు.

సాయిబాబాపై అసత్య ప్రచారాలు, విమర్శలు కొనసాగితే రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సాయి భక్తులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఓయూ విద్యార్థి నాయకులు ఆవుల మల్లేశం, వేముల కొండల్ గౌడ్, మామిడాల రవికుమార్, వెంకటేష్ గౌడ్, నరిమెట్ట గురు, పాలకుర్ల జానయ్య గౌడ్, ధీరజ్, శంకర్, ఎస్. నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సాయిబాబాపై అసత్య ప్రచారాలు ఆపాలి. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ఓయూ విద్యార్థి నాయకులు

Article Image

భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం–సిద్ధగురు రమణానంద మహర్షి ఆశ్రమంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, షిరిడి సాయిబాబాపై కొందరు చేస్తున్న విమర్శలు, అసత్య ప్రచారాలు కోట్లాది మంది సాయి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

సిద్ధగురు రమణానంద మహర్షి సాయిబాబా పక్షాన నిలబడి "శత ప్రశ్న శరసంధానం" గ్రంథం ద్వారా సాయి వ్యతిరేక ప్రచారాలకు సమాధానం ఇచ్చారని కొనియాడారు. సాయి భక్తులైన తాము కూడా మహర్షికి అండగా నిలిచి సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. త్వరలో సామూహికంగా మహాపీఠాన్ని సందర్శించి తమ మద్దతును ప్రకటిస్తామని వెల్లడించారు.

సాయిబాబాపై అసత్య ప్రచారాలు, విమర్శలు కొనసాగితే రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సాయి భక్తులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఓయూ విద్యార్థి నాయకులు ఆవుల మల్లేశం, వేముల కొండల్ గౌడ్, మామిడాల రవికుమార్, వెంకటేష్ గౌడ్, నరిమెట్ట గురు, పాలకుర్ల జానయ్య గౌడ్, ధీరజ్, శంకర్, ఎస్. నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News