అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి!
అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి!
K.RAVI
ప్రజావాణిలో కలెక్టర్‌కు వార్డు సభ్యుల ఫిర్యాదు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లేష్ గౌడ్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018ని ఉల్లంఘిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో వారు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.సి.ఎస్.ఆర్ నిధుల వినియోగంలో అక్రమాలు గ్రామంలో దివీస్ పరిశ్రమకు సంబంధించిన రూ. 98 లక్షల సీఎస్ఆర్ నిధుల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనుల్లో సర్పంచ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వార్డు సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన సర్పంచే స్వయంగా తన అనుచరులకు మద్దతు పలుకుతూ.. గ్రామ పంచాయతీ భూములను, రోడ్లను ఆక్రమించుకునేలా ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డుపై అక్రమంగా నాటిన కడీలను వెంటనే తొలగించాలి. సర్పంచ్ అక్రమాల వల్ల నిలిచిపోయిన గ్రామ సీసీ రోడ్డు పనులను పునఃప్రారంభించి, త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలి. పలు అక్రమాలకు పాల్పడుతున్న అంకిరెడ్డిగూడెం సర్పంచ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వలందాసు మహేష్, వార్డు సభ్యులు బత్తుల అనూష, పాలెం వెంకటేష్, ముద్దం లింగస్వామి, దొడ్ల అండాలు, దండుగుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి