Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:19 AM

షాబాద్‌ హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ మృతి

13-07-2026 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కొత్తూరు మండలంలోని పంజర్లలో మృతదేహం లభ్యం.. ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బాలిక సహా ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతిచెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామ శివారులో సోమవారం అతని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, రాజ్‌కుమార్ మృతదేహం సమీపంలో విషం బాటిల్ లభ్యమైంది. దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, పంజర్ల గ్రామం రాజ్‌కుమార్ మేనమామ స్వగ్రామం కావడంతో అక్కడికి వచ్చి విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా, షాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న దారుణ ఘటనలో బాలికతో పాటు మొత్తం ఆరుగురిని హత్య చేసిన కేసులో రాజ్‌కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Sthanikam

షాబాద్‌ హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News