Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:22 AM

ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన టీఆర్‌పీ నేతలు

13-07-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆత్మగౌరవ పోరాటాలకు ఐక్యంగా ముందుకు రావాలి : వట్టే జానయ్య యాదవ్

హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజికంగా వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న అవమానకర వ్యాఖ్యలు, వివక్షను ఇకపై సహించబోమన్నారు. ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అన్ని బహుజన వర్గాలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతాయని పేర్కొన్న ఆయన, భావితరం బానిసత్వ భావజాలాన్ని అంగీకరించదన్నారు. వెనుకబడిన వర్గాల రాజకీయ, సామాజిక సాధికారత కోసం ఐక్య ఉద్యమం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తు చేసుకుని, అనంతరం వారి సమస్యలను విస్మరించే రాజకీయ ధోరణులు మారాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ప్రతి వర్గానికి గౌరవం, సమాన అవకాశాలు లభించేలా పోరాటం కొనసాగించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఈశ్వరమ్మ యాదవ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఈశ్వరమ్మ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలను ఖండించిన టీఆర్‌పీ నేతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News