Sthanikam - Truth Matters
Logo

పరిశ్రమల కాలుష్యంతో పిట్టంపల్లి ప్రజల విలవిల!

Updated : 13 Jul 2026 17:09 IST
As Preferred Source 1 min read
పరిశ్రమల కాలుష్యంతో పిట్టంపల్లి ప్రజల విలవిల!

కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్.

నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పిట్టంపల్లి గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. గ్రామ పరిసరాల్లో ఉన్న కొన్ని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా పరిశ్రమల నుంచి వస్తున్న దట్టమైన పొగ, భరించలేని దుర్వాసన, ధూళి కారణంగా గ్రామంలో జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.కాలుష్యం ప్రభావంతో గ్రామ ప్రజల ఆరోగ్యం, పర్యావరణం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్న గ్రామస్తులు, దీనిపై సంబంధిత శాఖలతో వెంటనే విచారణ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ ప్రజల ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచనలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Sthanikam

పరిశ్రమల కాలుష్యంతో పిట్టంపల్లి ప్రజల విలవిల!

Article Image

మరిన్ని

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news