Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:30 AM

ఏపూర్‌ను మద్య రహిత గ్రామంగా మార్చాలి

ఏపూర్‌ను మద్య రహిత గ్రామంగా మార్చాలి

ఏపూర్‌ను మద్య రహిత గ్రామంగా మార్చాలి
13-07-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బెల్ట్ షాపుల నిర్మూలనకు కలెక్టర్‌కు గ్రామ ప్రజల వినతి.

నల్గొండ జిల్లా: చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అనధికార మద్యం విక్రయ కేంద్రాలు (బెల్ట్ షాపులు) వెంటనే రద్దు చేయాలని కోరుతూ గ్రామ సంరక్షణా సమితి ప్రతినిధులు, గ్రామ ప్రజలు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రతినిధి మందుల శ్రీకాంత్ మాట్లాడుతూ, గ్రామంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన బెల్ట్ షాపుల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ కూలీలు తమ కష్టార్జితాన్ని మద్యానికి వెచ్చిస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. యువత, విద్యార్థులు మద్యం వ్యసనానికి బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

గ్రామంలో మద్యం విక్రయాలు పెరగడంతో రాత్రి వేళల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, కుటుంబ కలహాలు అధికమవుతున్నాయని తెలిపారు. ఇటీవల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయని గుర్తుచేశారు.

ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే అక్రమ మద్యం రవాణాపై, బెల్ట్ షాపుల నిర్వహణపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి ఏపూర్‌ను పూర్తిస్థాయి “మద్య రహిత గ్రామంగా” తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు.

గ్రామ ప్రజల సంకల్పానికి అనుగుణంగా మద్యరహిత సమాజ నిర్మాణానికి సహకరిస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు.

Sthanikam

ఏపూర్‌ను మద్య రహిత గ్రామంగా మార్చాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News