Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:40 PM

అర్ధరాత్రి ఉక్కుపాదం. నల్లగొండలో పోలీసుల మెగా నాకాబందీ.

12-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

17 చెకింగ్ పాయింట్లలో 200 మంది పోలీసులు.. 146 వాహనాలు సీజ్ – 91 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.

నల్లగొండ పట్టణంలో అర్ధరాత్రి పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక నాకాబందీలో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, అంతర్గత రహదారులను పోలీసులు దిగ్బంధించి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ మెగా తనిఖీల్లో డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు, ఎస్ఐలు బాబురావ్ , ప్రత్యేక బృందాలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పట్టణంలోని 17 చెకింగ్ పాయింట్లలో సుమారు 200 మంది పోలీసులతో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 146 వాహనాలను సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 91 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ట్రిపుల్ రైడింగ్ చేసిన 30 మంది, మైనర్లు వాహనాలు నడిపిన 9 కేసులు, మోడిఫైడ్ సైలెన్సర్లతో తిరిగిన 4 వాహనాలను స్వాధీనం చేసుకోగా, నంబర్ ప్లేట్లు లేకుండా సంచరించిన 73 వాహనాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్లకు వాహనాలు అప్పగించడం, నంబర్ ప్లేట్లు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేసి రోడ్లపైకి రావడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక నాకాబందీలు, తనిఖీలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Sthanikam

అర్ధరాత్రి ఉక్కుపాదం. నల్లగొండలో పోలీసుల మెగా నాకాబందీ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News