Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

రామన్నపేట ఎస్ ఐ పై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

11-07-2026 261 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా భర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దుల రమేష్‌తో రామన్నపేట ఎస్ ఐ సతీష్ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు.చేనేత సంఘం ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించేందుకు వెళ్లిన బద్దుల రమేష్‌పై ఎస్ ఐ సతీష్ దుర్భాషలాడడమే కాకుండా భౌతికంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిరుమర్తి లింగయ్య శనివారం రామన్నపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐను కలిసి, సంబంధిత ఎస్ ఐ సతీష్ పై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటన రాజకీయ ఒత్తిళ్లు, అధికార పార్టీ నాయకుల ప్రేరేపణతో జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు.

సంబంధిత అధికారులు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ప్రజాస్వామ్యబద్ధంగా భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

అనంతరం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దుల రమేష్‌ను చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా కల్పించారు.

Sthanikam

రామన్నపేట ఎస్ ఐ పై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News