Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:31 AM

మునుగోడులో కంటి సమస్యల్లేని నియోజకవర్గమే లక్ష్యం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

05-07-2026 261 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15వ ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభం

ఇప్పటివరకు 2,325 మందికి విజయవంతంగా ఉచిత ఆపరేషన్లు

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడొద్దని, ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం చేయించే బాధ్యత నాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం చౌటుప్పల్‌లో 'కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్', ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన 15వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో 10,000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని, ఈ శిబిరాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు. "మీకు నేనున్నా.. ధైర్యంగా వెళ్లి ఆపరేషన్ చేయించుకోండి" అని లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా ఇచ్చారు.​రూపాయి ఖర్చు లేకుండా..గత 14 విడతల్లో మొత్తం 10,444 మందికి కంటి పరీక్షలు చేసి, 4,557 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని, 2,325 మందికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేయించామని ఆయన వివరించారు. ఈరోజు జరిగిన 15వ విడత శిబిరంలో 1,210 మందికి పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పైగా ఆపరేషన్లకు ఎంపికయ్యారు. వీరందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

మునుగోడులో కంటి సమస్యల్లేని నియోజకవర్గమే లక్ష్యం: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News