Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:33 AM

కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు

04-07-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు, జులై 4: ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలోని శివాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహించిన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు శనివారం గోపూజ, కుంకుమార్చనతో ఘనంగా ముగిశాయి.

కార్యక్రమాల్లో భాగంగా శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై డమాం జగదీశ్ ధార్మిక ప్రవచనాలు నిర్వహించగా, స్థానిక భజన మండలి భక్తి గీతాలతో భక్తులను అలరించింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగానే ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు కడిమెట్ల ఈరన్నరావు, వేదపండితులు కె. శివమణి, కె. శంకరని, కె. దినేశ్, భజన మండలి సభ్యులు కంసాలి మోహన్, కె. భూషణరావు, బోయ శంకరప్ప, బోయ కేశన్న, లక్ష్మీకాంత్, బోయ నరసప్ప, బి. కిరణ్, బోయ నాయుడు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

కడిమెట్లలో ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News